తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2020, 4:45 PM IST

ETV Bharat / sports

4 ఓవర్లలో నాలుగుసార్లు ఔట్ చేసిన అశ్విన్

కెరీర్​ ప్రారంభం నుంచే తనదైన క్యారమ్​ స్పిన్​తో స్టార్​ బ్యాట్స్​మెన్​ను ముప్పతిప్పలు పెట్టేవాడు టీమ్​ఇండియా బౌలర్​ రవిచంద్రన్​ అశ్విన్​. అయితే ఎంతోమంది స్పిన్నర్లను అవలీలగా ఎదుర్కొన్న శ్రీలంక బ్యాట్స్​మన్​ కుమార సంగక్కర మాత్రం అశ్విన్​ బౌలింగ్​లో ఒకే సిరీస్​లో నాలుగు సార్లు ఔట్​ అయ్యాడు. ఆనాటి ప్రదర్శన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అశ్విన్​.

Ashwin on dismissing Sangakkara four times in 23 balls in 2015 Test series
'సంగాక్కరను నాలుగు సార్లు ఔట్​ చేయడానికి కారణమదే!'

శ్రీలంక స్టార్​ బ్యాట్స్​మన్​ కుమార సంగక్కర వంటి వారిపై తన స్పిన్​ మాయాజాలంతో ఆధిపత్యం చెలాయించాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్. తన ప్రదర్శన వెనకున్న కారణాలను.. పాకిస్థాన్​ జర్నలిస్టు అర్షద్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించాడు​.

"మురళీధరన్​, అజ్మల్​ వంటి స్పిన్నర్లు మిగిలిన వారితో పోలిస్తే ప్రత్యేక బౌలింగ్ శైలిని కలిగిన వారు. అలాంటి వారి బంతులని బ్యాట్స్​మెన్​ ఎదుర్కొలేకపోయేవారు. వీరిద్దరితో పాటు సునీల్​ నరైన్​ అలాంటి కోవకి చెందినవాడే. బంతిని గాల్లో కాకుండా చేతిలోనే మాయాజాలం చేయగల నేర్పు తనకు ఉంది. అయితే ముత్తయ్య మురళీధరన్​ స్పిన్​ను మాత్రం వీరేంద్ర సెహ్వాగ్​ బాగా ఆడేవాడు".

-రవిచంద్రన్​ అశ్విన్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

2015లో భారత్​, శ్రీలంక మధ్య జరిగిన టెస్టు సిరీస్​ గురించి అశ్విన్​ మాట్లాడుతూ.. "నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే అదే సమయంలో నా కెరీర్​ నిలకడగా సాగుతోంది. అప్పుడు జరిగిందంతా ఓ కలలాగే ఉంటుంది. ఆ సిరీస్​లో మంచి డెలివరీలు వేశాను. మంచి ఫామ్​లో ఉన్నాను. ఎడమ వాటం గల బ్యాట్స్​మెన్​కు బంతులు వేయాలనేది నా కల. శ్రీలంకలో బౌలింగ్​ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే స్పిన్​ చేయగలిగేంత పెద్ద మైదానాలు కాకపోయినా.. బంతి బౌన్స్​ అవ్వడం సహా కొన్నింటికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి నా కెరీర్​లో ఆ దశలో వేసిన బౌలింగ్​ను నిజంగా ఆస్వాదించాను. అదే సమయంలో సంగక్కరను బాగా ఇబ్బందిపెట్టా" అని రవిచంద్రన్​ అశ్విన్​ స్పష్టం చేశాడు.

ఈ సిరీస్​లో కుమార సంగక్కరకు 23 బంతులు సంధించి ఏకంగా నాలుగు సార్లు ఔట్​ చేసిన ఘనతను అశ్విన్​ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మురళీధరన్​ బౌలింగ్​లో కీపింగ్​ చేస్తూ.. స్పిన్​ గురించి బాగా పట్టుసంపాదించుకున్నట్లు సంగక్కర ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details