ఫిబ్రవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐసీసీ ప్రకటించింది. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 32 వికెట్లు తీసుకున్న అశ్విన్.. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 24 వికెట్లు దక్కించుకున్నాడు. అలాగే అద్భుత సెంచరీని సాధించి టీమ్ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఈ అవార్డును జనవరి నెలకుగానూ పంత్ దక్కించుకోగా.. తాజాగా అశ్విన్ను ఈ అవార్డు వరించింది.