తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్​గా అశ్విన్​

టీమ్​ఇండియా స్పిన్నర్​ అశ్విన్​ మరో ఘనతను సాధించాడు. టెస్టు సిరీస్​లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను రెండు సార్లు తీసిన తొలి భారత బౌలర్​గా నిలిచాడు.

By

Published : Mar 6, 2021, 3:28 PM IST

భారత ఆఫ్​స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్టు సిరీస్​లో 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను రెండు సార్లు సాధించిన తొలి భారత బౌలర్​గా నిలిచాడు.

ప్రస్తుత ఇంగ్లాండ్​ సిరీస్​ చివరి టెస్టులో ఈ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్​లో రూట్​ వికెట్ తీసి.. సిరీస్​లో 30 వికెట్ల మైలురాయిని చేరాడు.

అంతకుముందు 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో 31 వికెట్లు పడగొట్టాడు.

సుదీర్ఘ ఫార్మాట్​లో 400పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్​ అశ్విన్​. ఇటీవలే మూడో టెస్టు అనంతరం.. బౌలర్ల ర్యాంకింగ్స్​లో మూడో స్థానానికి ఎగబాకాడు యాష్​.

వాళ్లు ఒక్కసారే..

భారత మాజీ బౌలర్లు బిషన్​ సింగ్​ బేడీ, హర్భజన్​ సింగ్​, బీఎస్​ చంద్రశేఖర్​, కపిల్​ దేవ్​లు.. టెస్టు సిరీస్​లో 30 వికెట్ల ఘనతను ఒక్కోసారే అందుకున్నారు. తాజాగా అశ్విన్​ ఆ రికార్డును బ్రేక్​ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details