భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కలేదు. ఈ విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. అతడిని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు.
"టెస్టుల్లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. వెస్టిండీస్‌పైనా ఎంతో మంచి ప్రదర్శన కనబర్చాడు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించింది".
-గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు
వెస్టిండీస్‌పై టెస్టుల్లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. కరీబియన్లపై మొత్తం 11 మ్యాచ్‌లాడిన అశ్విన్ 552 పరుగులతో పాటు 60 వికెట్లు సాధించాడు.
అశ్విన్, రోహిత్‌లను పక్కన పెట్టడంపై స్పందించాడు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే. అన్నీ ఆలోచించే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాడు.