టెస్టు క్రికెట్లో 800 వికెట్లు సాధించే సామర్థ్యం టీమ్ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌కే ఉందని అన్నాడు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. కానీ, ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్‌కు ఆ ఘనత సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
"అశ్విన్.. 800 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు గొప్ప బౌలర్. మరే ఇతర యువ బౌలర్ ఆ మైలురాయిని అందుకుంటాడని నేను అనుకోవడం లేదు. నాథన్ లియోన్ వల్ల కూడా కాకపోవచ్చు. అతడు 400 వికెట్లకు చేరువలో ఉన్నాడు. కానీ ఆ ఘనత సాధించాలంటే అతడు మరెన్నో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది."
- ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ క్రికెటర్