తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజ మురళీధరన్​ రికార్డు బ్రేక్​ చేసిన అశ్విన్​ - అశ్విన్​ సరికొత్త రికార్డు

టీమ్ఇండియా స్పిన్నర్​ అశ్విన్​ సరికొత్త ఘనత సాధించాడు. టెస్టుల్లో లెఫ్ట్​-హ్యాండ్​ బ్యాట్స్​మెన్​ను ఎక్కువగా ఔట్ చేసిన బౌలర్​గా నిలిచాడు.

Ashwin breaks Muralitharan's record to claim unique Test record
ముత్తయ్య మురళీధరన్​ రికార్డు బ్రేక్​ చేసిన అశ్విన్​

By

Published : Dec 29, 2020, 7:29 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో టీమ్​ఇండియా స్పిన్నర్​ అశ్విన్​ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఎడమ చేతి వాటం​ బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయడంలో లంక దిగ్గజం మురళీధరన్​ను అధిగమించాడు. ఆసీస్​ ఆటగాడు హేజిల్​వుడ్​ వికెట్​తో అశ్విన్​ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లోని రెండు ఇన్నింగ్స్​లో కలిపి 5 వికెట్లు తీశాడు​.

అంతకు ముందు టెస్టుల్లో 191 మంది లెఫ్ట్​-హ్యాండ్​ బ్యాట్స్​మెన్​ను ఔట్​ చేసిన రికార్డు మురళీధరన్ పేరిట ఉంది. ఈ మార్క్​ను అశ్విన్​ 73 ఇన్నింగ్స్​లోనే దాటేశాడు.

ఈ జాబితాలో అశ్విన్​ (192), మురళీధరన్​ (191), ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ (186), ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు గ్లెన్​ మెక్​గ్రాత్​ (172), షేన్​ వార్న్ (172), టీమ్ఇండియా మాజీ స్పిన్నర్​ అనిల్​ కుంబ్లే (167) ఉన్నారు.

బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్​ల సిరీస్‌ 1-1తో సమమైంది. భారత జట్టు కెప్టెన్​ రహానె ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి:రహానె వచ్చాక డ్రస్సింగ్ రూమ్​లో అలా: అశ్విన్

ABOUT THE AUTHOR

...view details