ప్రపంచకప్‌లో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ను మోసగాళ్లంటూ అవహేళన చేశారు ఇంగ్లాండ్ అభిమానులు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులోనూ అదే విధంగా ఎగతాళి చేశారు. వార్నర్ ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది...?
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్‌ను చూపిస్తూ అతడి జేబులో సాండ్ పేపర్స్ ఉన్నాయంటూ అరిచారు అభిమానులు. వెంటనే స్పందించిన వార్నర్.. తన దగ్గర ఏమీ లేవంటూ అరచేతులు చూపిస్తూ, ప్యాంట్ జేబులు తెరచి చమత్కారంగా స్పందించాడు.
ఈ అనూహ్య పరిణామాన్ని చూసి ఇంగ్లీష్ అభిమానులు నవ్వి ఊరుకున్నారు. తొలి రోజు ఆటలోనూ వార్నర్, బాన్ క్రాఫ్ట్ బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు మోసగాళ్లు, మోసగాళ్లు అంటూ అరిచారు.
ఇది చదవండి: రెండో టీ20లో రికార్డులే రికార్డులే..!