యాషెస్ సిరీస్ మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 179 పరుగులకే ఆలౌట్‌కాగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు హజిల్‌వుడ్ 5, ప్యాట్ కమిన్స్ 3, ప్యాటిన్సన్ 2 వికెట్లతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు బంతులతో నిప్పులు చెరిగారు.
ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోయ్డిన్లే 12 పరుగులే అత్యధిక స్కోరంటే ఇంగ్లీష్ జట్టు పతనం ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.