తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్ ఆసీస్ వైపు.. ఇబ్బందుల్లో ఇంగ్లాండ్! - ausis

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆసీస్ 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్​  ముందుంచింది. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్(82) అర్ధశతకంతో మరోసారి ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 18కే 2 వికెట్లు కోల్పోయి పోరాడుతుంది.

యాషెస్

By

Published : Sep 8, 2019, 8:10 AM IST

Updated : Sep 29, 2019, 8:36 PM IST

యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకువెళ్తోంది. రెండో ఇన్నింగ్స్​లో 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్​ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. అంతకు ముందు కంగారూ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్(82) అర్ధశతకంతో మరోసారి ఆదుకున్నాడు. ఫలితంగా 186/6 స్కోరు వద్ద ఆసీస్ డిక్లేర్ ఇచ్చింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఐదో రోజు 365 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

ఓవర్ నైట్ స్కోరు 200/5 వద్ద శనివారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో వంద పరుగుల చేసి 301 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్(26), బెయిర్ స్టో(17) త్వరగా ఔట్ కావడం వల్ల తక్కువ పరుగులకే పరిమితమైంది. చివర్లో బట్లర్ 41 పరుగులతో పోరాడిన కారణంగా ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా మూడోసారి డకౌట్​ కాగా.. హ్యారిస్(6), మార్నస్ లబుషేన్(11) విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో మరోసారి ఆదుకున్నాడు స్టీవ్ స్మిత్. 92 బంతుల్లో 82 పరుగులు చేసి ఆసీస్​కు బాసటగా నిలిచాడు. మ్యాథ్యూ వేడ్ 34 పరుగులతో స్మిత్​కు సహకరించాడు.

తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 497 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో విజృంభించాడు. లబుషేన్, టిమ్​పైన్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్ల, జాక్ లీచ్, క్రేగ్ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇది చదవండి: ముందస్తు బెయిల్​ ప్రయత్నాల్లో షమి

Last Updated : Sep 29, 2019, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details