తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​ : డ్రాగా ముగిసిన రెండో టెస్టు - stokes

యాషెస్ రెండో టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి టెస్టు గెలిచిన ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో పోరు 22న ప్రారంభం కానుంది.

యాషెస్

By

Published : Aug 19, 2019, 9:14 AM IST

Updated : Sep 27, 2019, 11:54 AM IST

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 258 పరుగులకు ఇంగ్లీష్ జట్టు డిక్లేర్ చేసింది. బెన్​స్టోక్స్ (115) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

ఐదో రోజు ఆర్చర్​ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాట్స్​మెన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. గెలుపు సంగతేమో కానీ.. డ్రాగా ముగించడానికి కష్టపడ్డారు కంగారూ బ్యాట్స్​మెన్. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లాబస్​చేంజ్(59), హెడ్ (42) నాలుగో వికెట్​కు 85 పరుగులు జోడించారు.

మధ్యలో స్పిన్నర్ జాక్ లీచ్, ఆర్చర్ ఆసీస్ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేశారు. వీరి ధాటికి స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. క్రీజులో ఉన్న హెడ్​, కమిన్స్​ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్​, లీచ్​ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు.

మొదటి ఇన్నింగ్స్​లో 258 పరుగులు చేసిన ఇంగ్లాండ్​.. రెండో ఇన్నింగ్స్​లోనూ అవే పరుగులు చేసింది. ఇలా చేయడం ఇంగ్లీష్ జట్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.

తొలి కాంకషన్ సబ్​స్టిట్యూషన్​

ఆర్చర్ వేసిన బంతి తగిలి గాయంతో బాధపడిన ఆసీస్ ఆటగాడు స్మిత్​ ఐదో రోజు ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కాంకషన్​ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్​చేంజ్​ను ఎంపిక చేశారు. రెండో ఇన్నింగ్స్​లో 59 పరుగులతో సత్తాచాటాడీ బ్యాట్స్​మెన్.

ఇవీ చూడండి.. గాయంతో స్మిత్​ ఔట్​.. తొలిసారి కాంకషన్​​కు అవకాశం

Last Updated : Sep 27, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details