తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్: ఆసీస్​ను కట్టడిచేసిన ఆర్చర్​ - steve smith

యాషెస్​ చివరి టెస్టులో ఇంగ్లాండ్​ 78 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్​ జట్టు 294 పరుగులే చేయగా... ఆస్ట్రేలియా 225కే పరిమితమైంది. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​ 6 వికెట్లు తీశాడు.

యాషెస్: ఆసీస్​ను హడలెత్తించిన జోఫ్రా ఆర్చర్​

By

Published : Sep 14, 2019, 8:15 AM IST

Updated : Sep 30, 2019, 1:23 PM IST

యాషెస్​ చివరి టెస్టులో ఇంగ్లాండ్​ స్వల్ప ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 225 పరుగులకే ఆలౌటైంది. ​జోఫ్రా ఆర్చర్​ 6 వికెట్లు తీసి ఆసీస్​ను కట్టడి చేశాడు.మొదటి ఇన్నింగ్స్​లోఇంగ్లాండ్294 పరుగులు చేసింది.

ఆపద్భాందవుడు స్మిత్​...

మొదటి ఇన్నింగ్స్​ రెండో రోజు బ్యాటింగ్​ ప్రారంభించిన కంగారూ జట్టు ఓపెనర్లు నిరాశపర్చారు. స్టార్​ బ్యాట్స్​మెన్​ డేవిడ్​ వార్నర్​ (5) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్​ హ్యారిస్ ​(3) వెంటనే ఔటయ్యాడు. వీళ్లిద్దరినీ ఆర్చర్ ఔట్ చేయడం వల్ల ఆసీస్ 14/2తో నిలిచింది. ఈ దశలో స్టీవ్ స్మిత్ 80 పరుగులు (145 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్సర్​) మరోసారి రాణించాడు.

సిరీస్​లో ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారైన స్మిత్... లబుషేన్ (48)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా ఆసీస్ 83/2తో పటిష్ఠ స్థితికి చేరుకుంది. అదే సమయంలో లబుషేన్​ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు ఆర్చర్​. ఆ తర్వాత ఓ ఎండ్​లో స్మిత్ పోరాడుతున్నా.. అతడికి సరైన సహకారం అందలేదు. వేడ్ (19), మిచెల్ మార్ష్ (17) ఔటయ్యాక ఆసీస్ పతనం వేగం పుంజుకుంది. 187 పరుగుల వద్ద స్మిత్ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సిడిల్ (18), లైయన్ (25)ల పోరాటం వల్ల ఆసీస్ 200 మార్కు దాటింది.

ఆర్చర్​ అదరహో...

సిరీస్​లో చక్కటి ప్రదర్శన చేస్తున్న ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్... తన పదునైన పేస్​ బౌలింగ్​తో ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్లను ఇబ్బంది పెట్టాడు. 62 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సిరీస్​లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ సామ్​కరన్ 46 రన్స్​ ఇచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా అనూహ్యంగా కుప్పకూలింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్... ఆట ఆఖరుకు వికెట్​ నష్టపోకుండా 9 పరుగులతో ఉంది. ఓపెనర్లు బర్న్స్​ (4), డెన్లే (1)తో అజేయంగా ఉన్నారు. ఉదయం 271/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ జట్టు... ఇంకో 23 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. బట్లర్ 70 పరుగుల చేసి ఔటయ్యాడు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details