అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అస్గర్ అఫ్గాన్‌ను కొత్త సారథిగా నియమించింది. బుధవారం.. ఏసీబీ ఈ విషయాన్ని ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ అస్గర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని చెప్పింది.
కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్ ఔట్... అఫ్గాన్‌కు బాధ్యతలు - asghar afghan
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా అస్గర్ అఫ్గాన్‌ను నియమించింది ఆ దేశ బోర్డ్. మూడు ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఉద్వాసన పలికింది.
గత ఏప్రిల్‌లో అస్గర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఏసీబీ... టెస్టుల్లో రహ్మత్ షా, వన్డేల్లో గుల్బదిన్ నైబ్, టీ20ల్లో రషీద్ ఖాన్‌లకు బాధ్యతలు అప్పగించింది. వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు.. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అనంతరం రషీద్ ఖాన్‌కు మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీని కట్టబెట్టారు.
అయితే ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ల్లో అన్ని ఫార్మాట్‌ల్లోనూ అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. ఈ కారణంతో ఏసీబీ.. రషీద్‌ను కెప్టెన్‌గా తప్పించి అనుభవజ్ఞుడైన అస్గర్‌కే పగ్గాలు అప్పగించింది.