అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. రెండోసారి అతడు పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అఫ్గాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఇబ్రహీమ్ మోమంద్ ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా క్రికెటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అస్గర్‌కు తన మొదటి భార్య ద్వారా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.
రెండో పెళ్లికి సిద్ధమైన అఫ్గాన్ కెప్టెన్ - రెండోసారి పెళ్లి అస్గర్ అఫ్గాన్
తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు అఫ్గాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అస్గర్ అఫ్గాన్. త్వరలోనే అతడు మరోసారి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇదివరకే అతనికి వివాహం కాగా.. ఓ కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.
![రెండో పెళ్లికి సిద్ధమైన అఫ్గాన్ కెప్టెన్ Asghar Afghan gets engaged for the second time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9536214-597-9536214-1605270562371.jpg)
2015లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు అస్గర్. అప్పటినుంచి 56 వన్డేలకు నాయకత్వం వహించి.. 36 వన్డేల్లో విజేతగా నిలిపాడు. అతడి సారథ్యంలోని అఫ్గాన్ జట్టు.. 2018 ఆసియా కప్ కోసం భారత్‌తో పోటీ పడగా ఆ మ్యాచ్ టైగా ముగిసింది. పలు కారణాల రీత్యా 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్‌కు గుల్బాదిన్ నైబ్ సారథ్యం వహించాడు. కానీ, లీగ్ దశలో జరిగిన 9 మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇదీ చదవండి:నేను చూసిన వారిలో కోహ్లీ ది బెస్ట్: ఆస్ట్రేలియా కోచ్