టీమ్ఇండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయమై స్పందించిన టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి.. మహీ గొప్పతనం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. జేబుదొంగతనాలు చేసే వారి కన్నా ధోనీ పరుగెడతాడని ప్రశంసించాడు. అన్ని ఫార్మాట్లలోనూ చెరగని ముద్రవేసి, క్రికెట్ రూపురేఖల్ని మార్చేశాడని అన్నాడు. తన ప్రశాంత స్వభావమే మహీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పాడు.
ధోనీ.. టీ20ల్లో ప్రపంచకప్‌లు సహా ఐపీఎల్ టైటిల్స్‌ను సాధించాడు. వన్డేల్లో ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు.టెస్టుల్లోనూ టీమ్ఇండియాను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాడు. వికెట్‌కీపర్‌గా మహీ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. మొత్తంగా క్రికెట్ చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.-రవిశాస్త్రి, టీమ్ఇండియా కోచ్
గతేడాది వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో చివరగా కనిపించిన ధోనీ.. అనంతరం ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అనేక ఊహాగానాల మధ్య ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.