తెలంగాణ

telangana

ETV Bharat / sports

మానసిక ఒత్తిడికి లోనవుతున్న 'బిర్లా'.. ఆటకు బ్రేక్​ - ఆర్యమాన్ బిర్లా ఇన్​ స్టా పోస్ట్​

భారత ఫస్ట్​క్లాస్ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా క్రికెట్​కు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నట్లు ఇన్ స్టా వేదికగా తెలిపాడు.

Aryaman Birla takes indefinite break from cricket
ఆర్యమాన్ బిర్లా

By

Published : Dec 21, 2019, 11:01 AM IST

మానసిక ఒత్తిడితో ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ క్రికెటర్​ మ్యాక్స్​వెల్ బాటలోనే వెళ్తున్నాడు. భారత ఫస్ట్​క్లాస్ ఆటగాడు ఆర్యమాన్ బిర్లా క్రికెట్​కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్​ స్టా వేదికగా తెలిపాడు.

ఆర్యమాన్ బిర్లా ఇన్​ స్టా పోస్ట్​

"అంకిత భావం, కఠోర శ్రమ, ధైర్యంతో క్రికెట్​లో నా ప్రయాణం ఇప్పటివరకు సాగింది. అయితే కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నా. నేను బంధీగా మారానని అనిపిస్తోంది. నాకు నేనే ఒత్తిడిలోకి వెళ్లిపోయా. ప్రస్తుతం నా మానసిక స్థితి మెరుగు పర్చుకోవాలనుకుంటున్నా. కాబట్టి క్రికెట్​కు విరామం తీసుకోవాలని నిర్ణయించా. ఇది ఎన్ని రోజులో చెప్పలేను. ఈ ఫేజ్​ నాకు కష్టంగా ఉంది. ఈ నిర్ణయం వల్ల నా నిజమైన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరనేది తెలుస్తుంది. ఈ స్థితి నుంచి బయటపడి ఇంతకుముందు కంటే శక్తిమంతంగా తయారవుతానని అనుకుంటున్నా" - ఆర్యమాన్ బిర్లా, యువ క్రికెటర్.

ఆర్యమాన్ ప్రముఖ వ్యాపారవేత్త కుమారమంగళం బిర్లా తనయుడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది రాజస్థాన్ అతడిని వదులుకుంది. అయితే గురువారం జరిగిన వేలంలో ఆర్యమాన్​ను తీసుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

ఇప్పటివరకు 9 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లు ఆడాడు ఆర్యమాన్. ఇందులో ఓ శతకం(103) కూడా ఉంది. మధ్యప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇతడు 2017లో తొలి ఫస్ట్​ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తొలి మ్యాచ్​ ఒడిషాతో ఆడాడు.

ఇదీ చదవండి: వావ్.. అనిపిస్తున్న ఒలింపిక్ మైదానం

ABOUT THE AUTHOR

...view details