తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 8:54 PM IST

ETV Bharat / sports

13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలమే 'అర్జున': ఇషాంత్

పదమూడేళ్ల పాటు తాను పడిన కష్టానికి ప్రతిఫలమే 'అర్జున' అని టీమ్​ఇండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ చెప్పాడు. ఈ పురస్కారం తనకు దక్కడం పట్ల తన కుటుంబసభ్యులు ఎంతో గర్వపడుతున్నారని తెలిపాడు.

Arjuna Award is fruit of my hard work in last 13 years: Ishant
'నా 13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలమే అర్జున అవార్డు'

జాతీయ క్రీడా పురస్కారాల్లో ఒకటైన 'అర్జున' దక్కడం పట్ల టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 13 ఏళ్లపాటు పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలమని అన్నాడు. ఈ అవార్డు తనను వరించడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడుతున్నారని ఓ వీడియో ద్వారా వెల్లడించాడు​.

"అర్జున అవార్డుకు ఎంపికైనప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. గత 13 ఏళ్లుగా చాలా కష్టపడ్డాను. కాబట్టి ఈ పురస్కారం దక్కడం నాకు నా కుటుంబానికి ఎంతో గర్వకారణం. నా కంటే నా భార్య ఇంకా గర్వపడుతోంది. ఎందుకంటే ఇది నాకు రావాలని ఆమె బలంగా కోరుకుంది"

-ఇషాంత్​ శర్మ, టీమ్ఇండియా బౌలర్​

బౌలింగ్​లో టీమ్​ఇండియా సత్తా చాటుతుండటానికి గల కారణాల్ని ఇషాంత్ వెల్లడించాడు​. జట్టులోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రదర్శనలపై దృష్టి పెట్టకుండా మ్యాచ్​ గెలిచేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని చెప్పాడు.

జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ క్రీడా పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రదానం చేయనుంది. రాజీవ్​గాంధీ ఖేల్​రత్నకు ఐదుగుర్ని.. అర్జున అవార్డు కోసం 27 మందిని ఎంపిక చేసింది. ఖేల్​రత్న రోహిత్ శర్మకు దక్కగా.. ఇషాంత్​ శర్మ, మహిళా క్రికెటర్​ దీప్తి శర్మకు 'అర్జున' వరించింది.

ABOUT THE AUTHOR

...view details