టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్‌కు ఎట్టకేలకు కోరుకున్న అవకాశం లభించింది. వచ్చే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ముంబయి జట్టు తరఫున బరిలో దిగనున్నాడు అర్జున్. ఈ విషయాన్ని సదరు జట్టు చీఫ్ సెలక్టర్ సలీల్ అంకోలా శనివారం స్పష్టం చేశారు.
"బీసీసీఐ జట్టులో తొలుత 20మందిని మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించింది. కానీ తర్వాత జట్టులోని ఆటగాళ్ల సంఖ్యను 22కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్జున్ తెందూల్కర్, కృతిక్ హంగవాడిని ఎంపిక చేశాం."