తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మృతి మంధాన.. ప్రేమలో ఉందా..! - Smriti Mandhana

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిలిపి సమాధానం ఇచ్చింది.

స్మృతి మంధాన

By

Published : Nov 13, 2019, 8:33 PM IST

స్మృతి మంధాన.. ఈ పేరు చెబితే క్రికెట్ అభిమానులకు ఆమె చక్కటి రూపం కళ్లముందు మెదులుతుంది. తన బ్యాట్​ నుంచి జాలువారే ముచ్చటైన షాట్లు గుర్తుకువస్తాయి. అందంతో పాటు ఆటలోనూ ముందు వరుసలో ఉన్న ఈ టీమిండియా మహిళా క్రికెటర్​కు ఫ్యాన్స్​ కోకొల్లలు. ఎప్పుడూ అభిమానులతో టచ్​లో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు చిలిపి సమాధానమిచ్చి కుర్రకారు గుండె లయ పెంచింది.

స్మృతి మంధాన

ఈ మధ్యే అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది స్మృతి. ఆమె ఎవరి ప్రేమలోనైనా ఉన్నారా అని తెలుసుకొనేందుకు ఒకరు ప్రయత్నించారు. ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉంటున్నారా? అని ప్రశ్నించగా "ఉమ్‌మ్‌మ్‌.. బహుశా" అని చిలిపి సమాధానం ఇచ్చింది. ఎవరిపై క్రష్‌ ఉందని అడగ్గా "నేను పదో ఏట ఉన్నప్పటి నుంచి హృతిక్‌ రోషన్‌పై" అని మంధాన చెప్పింది. ప్రస్తుతం ఈ అందమైన క్రికెటర్‌ మరో 100 రోజుల్లో ఆసీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలిపించాలన్న పట్టుదలతో ఉంది.

చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులను నెలకొల్పింది స్మృతి. శిఖర్‌ ధావన్‌ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా ఘనత అందుకుంది. 51 మ్యాచుల్లో 43.08 సగటుతో ఆమె 2,025 పరుగులు చేసింది. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి.

ఇవీ చూడండి.. గిల్​క్రిస్ట్​ను కంగారుపెట్టిన బౌలర్​ ఎవరో తెలుసా.!

ABOUT THE AUTHOR

...view details