తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్చర్​ వల్ల ఇంగ్లాండ్ బోర్డుకు లక్షల పౌండ్లు నష్టం!

జోఫ్రా ఆర్చర్​ క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇంగ్లాండ్ బోర్డు డైరెక్టర్ పేర్కొన్నారు. బయో సెక్యూర్​ నిబంధనలు అతిక్రమించడం వల్ల దాదాపు పదిలక్షల పౌండ్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Archer's breach of bio-secure protocol could have been disaster, cost us millions: ECB's Giles
ఆర్చర్

By

Published : Jul 17, 2020, 11:54 AM IST

బయో సెక్యూర్​​ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్..​ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆ దేశ క్రికెట్​ బోర్డు (ఈసీబీ) డైరెక్టర్​ ఆష్లే గైల్స్​ వెల్లడించారు. అతడి చర్య వల్ల​ బోర్డుకు పదిలక్షల పౌండ్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

నిబంధనలు అతిక్రమించిన కారణంగానే వెస్టిండీస్​తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు నుంచి ఆర్చర్​ను తప్పించారు. ఫలితంగా రెండుసార్లు కొవిడ్ పరీక్షలు జరపడం సహా ఐదు రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండనున్నాడీ క్రికెటర్.

ఆర్చర్​

అయితే ఈ విషయమై ఆర్చర్​, బోర్డుకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తొలి టెస్టు ముగిసిన తర్వాత బర్మింగ్​హమ్​లోని ఇతడు తన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు కోరాడు​. దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ బోర్డు.. "సాధారణ పరిస్థితుల్లో మ్యాచ్​ల మధ్య ఇంటికి వెళ్లడం సాధారణమే. కానీ బయో సెక్యూర్​ వాతారణాన్ని నెలకొల్పేందుకు ఎంతో పని, డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ చర్యతో ఆర్చర్​ జట్టు మొత్తాన్ని నిరాశపరిచాడు" అంటూ పేర్కొంది.

ఆర్చర్​

కరోనా వ్యాప్తి ఉన్నాసరే వెస్టిండీస్​, పాకిస్థాన్​ జట్లను తమ దేశంలో పర్యటించేందుకు ఈసీబీ విశ్వ ప్రయత్నాలు చేసి సఫలమైంది. విండీస్​తో టెస్టు సిరీస్​​ అనంతరం పాకిస్థాన్​తో టెస్టు, టీ20 సిరీస్​ను ఆడనుంది ఇంగ్లాండ్​. ఐర్లాండ్​, ఆస్ట్రేలియాలూ ఈ సీజన్​లో ఇంగ్లీష్ గడ్డపై మ్యాచ్​లు ఆడనున్నాయి.

ఇదీ చూడండి:'ఆ విషయాల్లో ధోనీ అడుగుజాడల్లోనే నడుస్తా'

ABOUT THE AUTHOR

...view details