న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ తర్వాత తన సతీమణి అనుష్కశర్మతో కలిసి విహారానికి వెళ్లాడు. తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. దీంతో ఆమె స్వదేశానికి తిరుగు పయనమైందని సమాచారం.
కోహ్లీ సతీమణి అనుష్క భావోద్వేగ పోస్టు - కోహ్లీ అనుష్క శర్మ
టీమిండియా సారథి కోహ్లీ.. తన సతీమణి అనుష్క శర్మతో న్యూజిలాండ్‌లో సరదాగా విహరించాడు. తాజాగా అనుష్క స్వదేశానికి పయనమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో పంచుకుందీ బాలీవుడ్ హీరోయిన్.
కోహ్లీ
ఈ సందర్భంగా విరాట్‌ను ఉద్దేశించి అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు పెట్టింది. "వీడ్కోలు పలకడం.. సమయంతో పాటు తేలికవుతుందని నువ్వు భావిస్తుండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు" అని కోహ్లీతో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
ఈ ఫొటోకు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. అందమైన జంట అంటూ పోస్టులు పెడుతున్నారు.
Last Updated : Mar 1, 2020, 5:26 PM IST