తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ అనుష్క కలిసున్నది 21రోజులే! - Anushka Sharma says 21days only with kohli

తన దాంపత్య జీవితం గురించి మాట్లాడిన నటి​ అనుష్క శర్మ... వివాహం జరిగిన తొలి ఆరునెలల్లో భర్త​ కోహ్లీతో కలిసి కేవలం 21రోజులే కలిసి ఉన్నట్లు చెప్పింది. లాక్​డౌన్ వల్ల ఇప్పుడు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నామని తెలిపింది.

kohli
కోహ్లీ, అనుష్క

By

Published : Jul 2, 2020, 7:47 PM IST

సెలబ్రిటీలు వృత్తిపరంగా ఎప్పుడూ బిజీ షెడ్యూల్​​తో ఉంటారు. వారు కుటుంబంతో కలిసి ఉన్న క్షణాలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ..​ తన వివాహం జరిగిన తర్వాత తొలినాళ్లలో సంఘటనల్ని పంచుకుంది.

"మేం(అనుష్క-కోహ్లీ) పెళ్లయితే చేసుకున్నాం. కానీ మా ఇద్దరికి వృత్తిపరంగా ఒకదానికొకటి పొంతన కుదిరేది కాదు. ఆయన క్రికెట్‌ మ్యాచ్‌లు.. నేనేమో సినిమా షూటింగ్‌లతో బిజీ. మా ఇద్దరికి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కలిసి భోజనం చేసేందుకు వెళ్లేవాళ్లం. ఇలా మేం వివాహం జరిగిన మొదటి ఆరునెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసున్నాం. మిగతా సమయమంతా, క్షణం తీరిక లేకుండా గడిపాం. అయితే ఆ 21 రోజులు నాకెంతో ఇష్టమైనవి, అమూల్యమైనవి. లాక్‌డౌన్‌కు ముందు ఎంతో బిజీగా ఉండే మేం.. ఇప్పుడు మాత్రం కావాల్సినంత సమయాన్ని కలిసి ఎంజాయ్ చేస్తున్నాం"

- అనుష్కశర్మ, బాలీవుడ్ ప్రముఖ నటి

2018లో షారుక్‌‌ 'జీరో'లో హీరోయిన్​గా నటించిన అనుష్క.. ఆ తర్వాత మరో చిత్రంలో నటించలేదు. అయితే ఈ ఏడాది వచ్చిన 'అంగ్రేజీ మీడియం'లో ప్రత్యేక గీతంలో కనిపించి అలరించింది. ఈ మధ్యనే విడుదలైన వెబ్‌ సిరీస్​లు‌ 'పాతాళ్‌ లోక్'‌, 'బుల్‌బుల్‌'లకు నిర్మాతగా వ్యవహరించింది.

ఇది చూడండి : మూడుసార్లు తిరస్కరణ.. మనోజ్ ఆత్మహత్యాయత్నం​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details