లాక్డౌన్ సమయంలో టీమ్ఇండియా కెప్టెన్, అతని సతీమణి అనుష్క శర్మ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా, విరాట్‌ను విసిగించడమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది అనుష్క. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. "మీ భర్తను విసిగించిన ఓ సందర్భాన్ని చెప్పండి" అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఏదైనా బోర్డు గేమ్‌లో కోహ్లీని ఓడించి రెచ్చగొడితా. ఎందుకంటే అతనికి ఓడిపొవడమంటే ఇష్టముండదు" అని చెప్పుకొచ్చింది.
కోహ్లీని విసిగించడానికి అనుష్క ఏం చేస్తుందంటే? - cricket news
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని విసిగించడమంటే ఎంతో ఇష్టమని అతని సతీమణి అనుష్క శర్మ తెలిపింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
విరాట్ కోహ్లీ
2017లో ఇటలీలో విరాట్‌ను వివాహం చేసుకున్న అనుష్క.. బంధం గట్టిగా నిలబడటానికి సాయపడే అంశాలను వివరించింది. ఓ మంచి బంధానికి నిబద్ధత ఎంతో ముఖ్యమని.. అందులోనూ విశ్వాసం ఉండాలని తెలిపింది.
ఇటీవలే అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరదల్లో నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని ఈ జంట హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్న మూడు సంస్థలకు మద్దతుగా ఉంటామని తెలిపారు.
Last Updated : Aug 4, 2020, 8:19 PM IST