బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు రోజుల్లోనే గులాబి టెస్టు ముగిసింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు సోమవారం ముంబయికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్లో దిగిన కోహ్లీకి భార్య అనుష్క శర్మ ఘన స్వాగతం పలికింది.
భర్త కోహ్లీని చూసి అనుష్క సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇరువురు కారులోఇంటికి బయల్దేరగా, కోహ్లీ ఒడిలో అనుష్క వాలిపోయింది. భర్తను గట్టిగా హగ్ చేసుకుని తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.