టీమ్ఇండియా సారథి కోహ్లీ-అనుష్క దంపతుల తమ బిడ్డ గురించి మాట్లాడారు. పాప ఫొటోలు తీయొద్దని కోరుతూ, చిన్నారి ప్రైవసీని గౌరవించాలని ఓ లేఖ విడుదల చేశారు.
"తల్లిదండ్రులుగా మా తరఫున నుంచి ఓ విన్నపం. మా కుమార్తె ప్రైవసీని రక్షించాలని భావిస్తున్నాం. ఇందుకోసం మీ మద్దతు, సహాయం మాకు అవసరం. మా పాపకు సంబంధించిన మీకు కావాల్సిన సమాచారాన్ని సరైన సమయంలో అందిస్తామని హామీ ఇస్తున్నాం. మీరు మాత్రం మా బిడ్డ ఫొటోలు తీయడం గానీ సమాచారాన్ని షేర్ చేయడం దయచేసి చేయొద్దు. మా అభ్యర్ధనను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ధన్యవాదాలు"