టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాజీ సారథి ధోనీ రికార్డును అధిగమించాడు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా సరికొత్త ఫీట్ సాధించాడు. భారత్ వేదికగా 29 టెస్టుల్లో టీమ్ఇండియాకు సారథిగా వ్యవహరించిన విరాట్.. 22 మ్యాచ్‌లు గెలుపొందాడు.
ధోనీ రికార్డును అధిగమించిన కోహ్లీ - india vs england
రికార్డుల రారాజు కోహ్లీ.. మరో ఫీట్ సాధించాడు. సొంత గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానంలో నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 22 విక్టరీలతో ధోనీని అధిగమించాడు.
![ధోనీ రికార్డును అధిగమించిన కోహ్లీ Another Record: Kohli eclipses Dhoni to record maximum Test wins as captain on home soil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10778599-thumbnail-3x2-dh.jpg)
స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాల కెప్టెన్‌గా కోహ్లీ
కోహ్లీ తర్వాతి స్థానంలో మహి ఉన్నాడు. సొంత గడ్డపై 30 టెస్టులకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 21 విజయాలు సాధించాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి:2 రోజుల్లోనే ముగిసిన పింక్ టెస్టు- భారత్‌దే విజయం