తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్-19 ప్రపంచకప్​లో ఒకే ఒక్క భారతీయుడు..! - Under-19 Worldcup 2020

దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్​ కోసం ఒకే ఒక్క భారత అంపైర్​ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్​లో అంపైరింగ్ చేస్తున్న అనిల్ చౌదరిని ఎంపిక చేసింది ఐసీసీ.

Anil Chaudhary only Indian in list of umpires for U-19 World Cup
అంపైర్

By

Published : Jan 9, 2020, 10:16 AM IST

దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ప్రారంభంకానున్న అండర్-19 ప్రపంచకప్​లో మొత్తం 16 మంది అంపైర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జాబితాలో ఒకే ఒక్క భారత అంపైర్ చోటు దక్కించుకున్నాడు. అనిల్ చౌదరి ఒక్కడే భారత్​ నుంచి అంపైరింగ్ చేయనున్నాడు.

54 ఏళ్ల అనిల్ 20 వన్డేలు, 27 టీ20లకు అంపైరింగ్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక - భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్​లోనూ ఇతడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటివరకు అనిల్ రెండు సార్లు అండర్-19 ప్రపంచకప్​కు ప్రాతినిధ్యం వహించారు.

ఈ టోర్నీల్లో మొత్తం 19 మ్యాచ్​లు నిర్వహిస్తుండగా.. 12 దేశాల నుంచి 16 మంది అంపైర్లను ఎంపిక చేసింది ఐసీసీ. వీరితో పాటు 8 మంది టీవీ అంపైర్లునూ తీసుకుంది. ఈ టోర్నీకి ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు. శ్రీలంక మాజీ ఆటగాడు గ్రేమ్ లాబ్రోయ్, దక్షిణాఫ్రికాకు చెందిన షాహిద్ వాడ్వాల్లా, ఇంగ్లాండ్​కు చెందిన ఫిలాండ్ విట్​కేస్​ను రిఫరీలుగా ఎంపిక చేసింది ఐసీసీ.

ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలో దిగుతోంది టీమిండియా.

ఇదీ చదవండి: కార్టూన్​తో 'లియో కార్టర్'​కు యువీ స్వాగతం

ABOUT THE AUTHOR

...view details