తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 8:32 AM IST

ETV Bharat / sports

'డీడీసీఏ సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా'

ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో దివంగత రాజకీయ నేత, డీడీసీఏ మాజీ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ విగ్రహం నెలకొల్పాలన్న ప్రతిపాదనను భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ వ్యతిరేకించారు. ఈ విషయంపై ప్రస్తుత డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి ఘాటు లేఖ రాశారు.

Bedi asks DDCA to remove his name from stands, quits membership
స్టాండ్​కు నా పేరు తీసేయండి: బిషన్ సింగ్

ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో దివంగత రాజకీయ నేత, దిల్లీ అండ్‌ డిస్ట్రిక్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ విగ్రహం నెలకొల్పాలన్న ప్రతిపాదనను భారత దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడి తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన డీడీసీఏలో తన సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. అంతేకాక 2017లో తన గౌరవార్థం కోట్లా మైదానంలోని ఓ స్టాండ్‌కు పెట్టిన తన పేరును తొలగించాలని కోరారు. డీడీసీఏకు ఆటగాళ్ల కంటే క్రికెట్‌ పాలకులే ఎక్కువైపోయారని ఆరోపించారు. ఈ విషయమై ప్రస్తుతం డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్‌ జైట్లీ తనయుడు రోహన్‌ జైట్లీకి బేడి ఘాటు లేఖ రాశారు.

"నాకు ఎంతో ఓర్పు, సహనం ఉన్నాయి. కానీ ఇప్పుడవి పూర్తిగా నశిస్తున్నాయి. డీడీసీఏ నన్ను ఎంతగానో పరీక్షించి, ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసింది. కోట్లా స్టేడియంలోని స్టాండ్‌కున్న నా పేరును వెంటనే తొలగించండి. నేను డీడీసీఏ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నా."

-బిషన్ సింగ్ బేడి, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన జైట్లీ.. డీడీసీఏకు 14 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. గతేడాది అనారోగ్య సమస్యలతో ఆయన మరణించాక ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియానికి జైట్లీ పేరే పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆరడుగుల ఎత్తుతో జైట్లీ విగ్రహాన్ని స్టేడియంలో నెలకొల్పాలని డీడీసీఏ నిర్ణయించడం బేడీకి ఆగ్రహం తెప్పించింది.

ABOUT THE AUTHOR

...view details