నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) నుంచి ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వైదొలిగారు. ఇందులో వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్ సహా మరో నలుగురు క్రికెటర్లు ఉన్నారు.
ఐదుగురు వీరే :
- ఆండ్రూ రసెల్ -వెస్టిండీస్
- డుప్లెసిస్-దక్షిణాఫ్రికా
- మిల్లర్ -దక్షిణాఫ్రికా
- మన్వీందర్ బిస్లా -భారత్
- డేవిడ్ మలన్ -ఇంగ్లాండ్
దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ఉన్న నేపథ్యంలో డుప్లెసిస్, మిల్లర్, మలన్ లీగ్‌కు దూరమయ్యారు. గాయం కారణంగా రసెల్ కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కానీ మనీందర్ బిస్లా తప్పుకోవడానికి గల కారణం తెలియలేదు.
ఈసారి లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) రెండు స్టేడియాల్లో జరగనుంది. ఒకటి క్యాండీ ప్రాంతంలోని పల్లెకెలె స్టేడియం కాగా మరోటి హంబన్‌టోటా లోని మహిందా రాజపక్సా స్టేడియం.
లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో కింగ్స్ జట్టుకు భారత్‌కు చెందిన మన్‌ప్రీత్ గోనీ, మన్వీందర్లు ఎంపికయ్యారు. నవంబర్ 21నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు ఆడనున్నారు.