ఇటీవల ఐపీఎల్లో పూర్తిగా నిరాశపరిచిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్.. లంక ప్రీమియర్ లీగ్‌లో చితక్కొట్టాడు. కొలంబో కింగ్స్ తరఫున ఆడుతూ, గాలే గ్లాడియేటర్స్‌పై అదిరే ప్రదర్శన చేశాడు. కేవలం 14 బంతుల్లో అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. దీంతో 34 పరుగుల తేడాతో కొలంబో కింగ్స్ విజయం సాధించింది. అయితే ఐపీఎల్ గ్లౌజ్‌తో రసెల్ కనిపించడం వల్ల నెటిజన్లు, లంక లీగ్‌పై సెటైర్లు వేస్తున్నారు.
ఐపీఎల్ గ్లౌజ్‌తో లంక ప్రీమియర్ లీగ్‌లో రసెల్! - 14 బంతుల్లో హాఫ్ సెంచరీ
కరీబియన్ ఆల్‌రౌండర్ రసెల్.. లంక ప్రీమియర్ లీగ్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. గాల్లే గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో 14 బంతుల్లో అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. అలానే ఐపీఎల్ గ్లౌజ్.. ఈ మ్యాచ్‌లో వేసుకుని ఆడాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రస్సెల్ విధ్వంసం.. 14 బంతుల్లో హాఫ్‌సెంచరీ
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కొలంబో జట్టు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. రసెల్ (19 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు చేసిందీ జట్టు. ఛేదనలో గాలే జట్టు 2 వికెట్లు నష్టపోయి 62 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా కొలంబో కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.