బంగ్లాదేశ్తోత్వరలో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు యువ క్రికెటర్ శివమ్ దూబే. దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి, సెలక్టర్ల దృష్టిలో పడి.. భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఈ అవకాశం రావడానికి కోహ్లీ సహకారం ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.
"సహజంగానే నాకు హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేశా. బ్యాటింగ్ దూకుడగా చేయాలని, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. పవర్ హిట్టింగ్ అంటే నాకిష్టం. టీమిండియాలో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది. ఎంపికవుతానని ముందే ఊహించా. ఎందుకంటే నా ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. క్రికెట్‌లో మెరుగయ్యేందుకు మరింత సాధన చేస్తా. ఆల్‌రౌండర్‌గా 100 శాతం ఏకాగ్రత, ఫిట్‌నెస్ నాకు అవసరం. ముంబయి అండర్-23 జట్టుకు ఎంపిక కానప్పుడు మా అన్నయ్య ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనైనా, ఏదైనా సమస్య తలెత్తినా కోహ్లీతో పంచుకునేవాడిని. అతడు నా సమస్యను అర్థం చేసుకుని సాయం చేసేవాడు"
-శివమ్ దూబే, టీమిండియా యువ ఆటగాడు