సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. వర్తమాన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించడంపై అభినందనలు తెలిపిన ఆయన.. ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మ్యాచ్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ చూసి ముచ్చటపడిన మహీంద్రా.. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని కోరారు.
"ఓకే.. దుమ్ములేపారు. సిరీస్‌ను జేబులో వేసుకున్నారు. అభినందనలు. ఇప్పుడు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నాకు ఈ చలువ కళ్లద్దాలు(అక్షర్ పెట్టుకున్నవి) కావాలి. అవి ఏ బ్రాండ్? ఎక్కడ దొరుకుతాయ్?"అని మహీంద్రా ట్వీట్ చేశారు.