ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌పై ప్రశంసలు కురిపించారు భారత ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా. కరన్ ఆటతీరును.. హీరోయిజం, వినయం, దయ నిర్వచనంతో పోల్చారు. "మీరు హీరోయిజం, వినయం, దయ నిర్వచనం కోసం చూస్తున్నట్లయితే" అంటూ సామ్ కరన్ పోస్ట్‌ను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.
ఇండియాతో చివరి వన్డేలో అద్భుతమైన పోరాట పటిమ చూపాడు సామ్ కరన్. చివరి వరకు క్రీజులో ఉండి ఇంగ్లాండ్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ కైవసం చేసుకుంది.