భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బాక్సింగ్‌డే టెస్టు కచ్చితంగా అభిమానుల మధ్యే నిర్వహించాలని కోరారు ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ టేలర్. విక్టోరియాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా మ్యాచ్‌ను తరలించడానికి అధికారులు వెనుకాడరని తెలిపారు. పెర్త్, అడిలైడ్ ప్రాంతాల్లో కరోనా నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను ఆ మైదానాల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
"బాక్సింగ్ డే టెస్టు వేదిక మారుతుందా? మీరు గమనిస్తే క్రిస్మస్ సమయానికి ఆ మ్యాచ్‌కు కేవలం 10 వేల నుంచి 20 వేల మంది వీక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అంతమంది వీక్షకులు గొప్పగా అనిపించరు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను పెర్త్ లేదా అడిలైడ్ వేదికలకు మార్పు చేస్తే స్టేడియాలు నిండిపోతాయి. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లకు అడిలైడ్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం కేవలం 52 నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడయ్యాయి."