తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతా డే/నైట్ టెస్టుకు అమిత్ షా..! - amit shah

భారత్-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 22న తొలిసారి డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​కు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారని తెలిసింది. తాజాగా హోంశాఖ మంత్రి అమిత్​ షా కూడా ఈ మ్యాచ్​ ప్రారంభానికి విచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అమిత్ షా

By

Published : Nov 15, 2019, 6:21 AM IST

భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఈడెన్‌ గార్డెన్‌లో నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. చారిత్రక తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కు రావాల్సిందిగా.. బంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) ప్రధాని మోదీ, అమిత్‌ షాను ఆహ్వానించింది. ఇందుకు షా సానుకూలంగా స్పందించారని క్యాబ్‌ కార్యదర్శి అవిషేక్‌ దాల్మియా తెలిపారు.

ఈడెన్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో పాటు, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ టెస్టు సందర్భంగా షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ మేరీకోమ్, షట్లర్‌ పీవీ సింధులను సన్మానించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ తెలిపాడు.

ఇవీ చూడండి.. 'విరామ సమయంలో హ్యాట్రిక్​ గురించే ఆలోచించా'

ABOUT THE AUTHOR

...view details