పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. అమిర్ నిర్ణయం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాడు. గురువారం మీడియాతో మాట్లాడిన ఇంజమామ్.. ఆమిర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. ఎవరితోనైనా సమస్యలు ఉంటే హెడ్ కోచ్‌తో మాట్లాడాలని, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే జట్టు యాజమాన్యంతో చర్చించాలని సూచించాడు.
'ఆమిర్ నిర్ణయంతో పాక్ జట్టుపై ప్రతికూల ప్రభావం' - వకార్ యూనిస్ వార్తలు
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ రిటైర్మెంట్పై ఆ దేశ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. ఆమిర్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. జట్టులో ఎవరితోనైనా సమస్యలు ఉంటే హెడ్ కోచ్‌తో మాట్లాడాలని సూచించాడు. అప్పటికి పరిష్కారం కాకపోతే టీమ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని వెల్లడించాడు.
పాక్ క్రికెట్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌తో అతడికి విభేదాలున్నాయని తెలిసిందని మాజీ సారథి చెప్పాడు. అయితే, వకార్‌తో పాటు హెడ్ కోచ్ మిస్బాఉల్ హక్‌తో సైతం తనకు విభేదాలు ఉన్నాయని ఆమిర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ తన రిటైర్మెంట్‌కు కారణమని, ఏడాదిగా జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న నిర్ణయం పాక్ బౌలింగ్ యూనిట్‌పై ప్రభావం చూపదని, కానీ అది జట్టు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ఇంజమామ్ ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి:ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ జాన్ ఎడ్రిచ్ మృతి