తెలంగాణ

telangana

ETV Bharat / sports

హెచ్​సీఏ​లో అవినీతిపై అంబటి రాయుడు ట్వీట్ - Hyderabad cricket

హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​లో అవినీతి పెరిగిపోయిందని చెబుతూ ట్వీట్ చేశాడు భారత క్రికెటర్ అంబటి రాయుడు. అందుకే రానున్న రంజీ సీజన్​లో ఆడాలనుకోవట్లేదని అన్నాడు.

హెచ్​సీఏ​లో అవినీతిపై అంబటి రాయుడు ట్వీట్

By

Published : Nov 23, 2019, 1:39 PM IST

రాబోయే రంజీ సీజన్​లో హైదరాబాద్​ జట్టుకు ఆడాలనుకోవట్లేదని చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు.. మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ పరిస్థితికి కారణం.. హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్​లో ఉన్న అవినీతియేనని అన్నాడు.

"ఈ సీజన్​లో హైదరాబాద్​ తరఫున రంజీలు ఆడాలనుకున్నాను. కాకపోతే పరిస్థితులు మారాయి. హెచ్​సీఏలో చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకే నేను జట్టు నుంచి తప్పుకున్నాను" -అంబటి రాయుడు, బ్యాట్స్​మన్

హైదరాబాద్​ క్రికెట్​లో జరుగుతున్న అవినీతి గురించి చెబుతూ, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను టాగ్ చేస్తూ, శనివారం ఓ ట్వీట్ చేశాడు రాయుడు.

కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన రాయుడు.. మనసు మార్చుకుని దేశవాళీల్లో హైదరాబాద్​ తరఫున ఆడతానని ప్రకటించాడు. ఈ జట్టుకే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్​గా వ్యవహరించాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా జట్టు నుంచి బయటకొచ్చేశాడు.

హెచ్​సీఏలోని ప్రస్తుత పరిస్థితుల గురించి అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్​కు చెప్పినా, పట్టించుకోవట్లేదని అన్నాడు రాయుడు.

ఇది చదవండి: అంబటి రాయుడు వీడ్కోలు పలికాడా.. పలకాల్సి వచ్చిందా..!

ABOUT THE AUTHOR

...view details