తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్​పై వెనక్కి తగ్గిన రాయుడు? - ambati rayudu

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్​పై పునరాలోచించే పనిలో పడ్డాడట. మళ్లీ ఐపీఎల్​లో ఆడాలని భావిస్తున్నాడట.

రాయుడు

By

Published : Aug 24, 2019, 8:37 AM IST

Updated : Sep 28, 2019, 2:00 AM IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు.

"భారత్‌ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నా. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్నా."
-రాయుడు, టీమిండియా మాజీ ఆటగాడు.

రెండేళ్లు టీమిండియా తరఫున నిలకడగా ఆడినా.. రాయుడిని సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్​రౌండర్ విజయ్‌ శంకర్‌ను తీసుకుంది. ఈ విషయంపై రాయుడు సెలక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్​లో శిఖర్‌ ధావన్‌, విజయ్ శంకర్ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న అతడిని ఎంపిక చేయలేదు. పంత్‌, మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పంపించారు. భావోద్వేగానికి గురైన రాయుడు చివరికి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఇవీ చూడండి.. బౌల్ట్ రికార్డు: టెస్టుల్లో 250 వికెట్లు

Last Updated : Sep 28, 2019, 2:00 AM IST

ABOUT THE AUTHOR

...view details