తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రేయసి గెలుపు కోసం హార్దిక్​ పాండ్య పాట్లు! - Hardik Pandya, Natasa Stankovic, Nach Baliye, Aly Goni, Hardik Pandya appeals for votes, Hardik Pandya asks votes, Pandya behalf Natasa Stankovic, Pandya girl friend, హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిక్‌, అలీ గోని, నాచ్ బలియే, ప్రేయసి కోసం ఓట్లు ఆడుతున్న హార్ధిక్, రియాలిటీ డ్యాన్స్ షో, ప్రేయసి కోసం హార్దిక్​ విజ్ఞప్తి

ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విరామ సమయంలో తన ఆరోగ్యం కన్నా రూమర్ గర్ల్​ఫ్రెండ్ నటాషా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఆమెకు ఓట్లు వేసి గెలిపించమని అభిమానులను కోరుతున్నాడు.

ప్రేయసి కోసం పాట్లు పడుతున్న హార్దిక్​ పాండ్య.!

By

Published : Oct 29, 2019, 5:52 PM IST

Updated : Oct 29, 2019, 7:54 PM IST

టీమిండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య... వెన్నుగాయానికి శస్త్రచికిత్స చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నాడు. వ్యక్తిగత శిక్షకుడి సహాయంతో నడుస్తున్న వీడియోనుఇటీవలే పంచుకున్నాడు.​ ఆపరేషన్​ తర్వాత నుంచి వీల్​ఛైర్​లోనే ఉంటున్నాడు. ఈ విరామ సమయంలో తన​ రూమర్ గర్ల్​ఫ్రెండ్ నటాషా గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్​ చేశాడు.

నటి, డ్యాన్సర్ అయిన నటాషా.. ప్రస్తుతం ఓ రియాలిటీ డ్యాన్స్ షోలో పాల్గొంటోంది. ఆమెకు మద్దతుగా పోస్టు చేశాడు హార్దిక్​. తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా, ఆమె సహా డ్యాన్సర్​ అలీ గోనీ ఫొటో షేర్ చేసి వారిని విజేతలుగా నిలపాలని అభిమానులను కోరాడు.

"నటాషా, అలీలకు మీ మద్దతు కావాలి.. ఓటు వేసి గెలిపించండి" అని విజ్ఞప్తి చేశాడు హార్దిక్​ పాండ్య.

హార్దిక్​ పాండ్య పోస్టు

వన్డే ప్రపంచకప్‌ తర్వాత విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న హార్దిక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత గాయం బాగా ఇబ్బంది పెట్టడం వల్ల లండన్​లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

వీరిద్దరూ ఇద్దరే...

హార్దిక్ పాండ్య గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తా వంటి హీరోయిన్స్​తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు నటాషాతో ప్రేమలో ఉన్నాడు. త్వరలో ఈ భామను పెళ్లి కూడా చేసుకోనున్నాడట. పాండ్య కుటుంబం కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్​లో 'సత్యాగ్రహ', 'జీరో' సినిమాలతో అలరించిన నటాషా.. గతంలో తన తోటి డ్యాన్సర్​ అలీ గోనీతోనే ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వచ్చాయి.

Last Updated : Oct 29, 2019, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details