భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ షెడ్యూల్‌లో మార్పులను దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ తప్పుబట్టాడు. బీసీసీఐ ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తలవంచిందని విమర్శించాడు.
బీసీసీఐ చెప్పిందని మారుస్తారా: బోర్డర్ - allan border team india
భారత్-ఆస్ట్రేలియా న్యూ ఇయర్ టెస్టు తేదీ మార్పుపై అలెన్ బోర్డర్ స్పందించాడు. బీసీసీఐ చెప్పిందని మార్చుతారా అని ఆస్ట్రేలియా బోర్డును ప్రశ్నించాడు.
సాధారణంగా సిడ్నీలో జరిగే మ్యాచ్‌ను న్యూ ఇయర్ టెస్టుగా పరిగణిస్తారు. జనవరి మొదటి వారంలో ఈ టెస్టు ప్రారంభమవుతుంది. బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు న్యూ ఇయర్ మ్యాచ్ (జనవరి 3-7)కు మధ్య మూడు రోజుల విరామం ఉంటుంది. అయితే బీసీసీఐ విజ్ఞప్తి మేరకు జనవరి 7న మ్యాచ్ మొదలయ్యేలా ప్రతిపాదిత షెడ్యూల్‌ను సీఏ తయారు చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇరు దేశాల బోర్డులు ఈ ప్రతిపాదిత షెడ్యూల్‌కు ఇంకా ఆమోదముద్ర వేయలేదు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే సరే. కానీ ఆ సమయంలో కొన్ని రోజులు విరామం కావాలన్న భారత్ కోరిక మేరకు ఇలా చేస్తే మాత్రం సరికాదు" అని బోర్డర్ పేర్కొన్నాడు.