అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగకు రంగం సిద్ధమైంది. దేశంలో క్రీడలకు ఇంకాస్త సమయం ఉన్నా.. వేరే దేశాల మ్యాచ్లతోనైనా కాలక్షేపం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు రేపే (జులై 8) ప్రారంభం కాబోతుంది. లైవ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన, మొబైల్లో క్రికెట్ మ్యాచ్‌ల స్కోర్స్ చూడక చాలా రోజులవుతున్న తరుణంలో ఈ మ్యాచ్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చేదే. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే ప్రణాళికలన్ని సిద్ధం చేసుకున్నాయి.
తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 13 మందితో జట్టును ప్రకటించింది. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ కారణంగా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సారథిగా వ్యవహరించనున్నాడు. జాసన్ హోల్డర్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు కూడా గెలుపుపై విశ్వాసంతో ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది కరీబియన్ క్రికెట్ బోర్డు.
జూన్ 9న ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన విండీస్ బృందం మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉంది. అనంతరం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌ల్లో పాల్గొంది. ఇంగ్లాండ్ జట్టు కూడా ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్‌తో ఫామ్‌లోకి వచ్చింది.
బ్లాక్ లివ్స్ మ్యాటర్ లోగో
అమెరికన్ ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల సంతాపం తెలిపేందుకు సిద్ధమయ్యారు ఇంగ్లాండ్-వెస్టిండీస్ ఆటగాళ్లు. ఇరుజట్ల ఆటగాళ్లు తమ జెర్సీపై బ్లాక్ లివ్స్ మ్యాటర్ లోగోను ధరించనున్నారు. మొత్తం మూడు మ్యాచ్‌లు ఖాళీ మైదానాల్లో జరగనున్నాయి.
కరోనా కొత్త నియమాలు
కరోనా కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కష్టతరంగా మారింది. అయినా క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు కొన్ని దేశాలు సాహసం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐసీసీ కొన్ని నిబంధనలకు రూపకల్పన చేసింది. అందులో ముఖ్యమైనవి కొన్ని.
బంతిపై ఉమ్మి నిషేధం
కరోనా కారణంగా బంతిపై ఉమ్మిని రాయడాన్ని నిషేధించింది ఐసీసీ. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు ఇకపై బాల్‌కు సలైవా రాయకూడదు. ఈ నిబంధనను అతిక్రమిస్తే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత జట్టు పరుగుల్లో ఐదు రన్స్ కోత విధిస్తారు.
కరోనా సబ్‌స్టిట్యూట్
ఈ సబ్‌స్టిట్యూట్ కేవలం టెస్టులకు మాత్రమే. ఒకవేళ ఏ ఆటగాడైనా కరోనా లక్షణాలతో బాధపడితే అతడికి బదులుగా మరో ఆటగాడిని తీసుకోవచ్చు.
లోకల్ అంపైర్లు
కరోనా దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలను అన్ని దేశాలు రద్దు చేశాయి. ఈ కారణంగా వేరే దేశాల అంపైర్లను మ్యాచ్ కోసం నియమించడం కష్టంగా మారుతుంది. అందువల్ల ఐసీసీ ఎలీట్ ప్యానెల్‌లోని ఆ దేశంలోని అంపైర్లకే బాధ్యతలు అప్పగించనున్నారు.
అదనపు డీఆర్ఎస్