తెలంగాణ

telangana

By

Published : Dec 1, 2019, 11:38 PM IST

ETV Bharat / sports

వరుసగా రెండో ఏడాది 'ముస్తాక్ అలీ' కర్ణాటకదే

సూరత్​ వేదికగా జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది.

వరుసగా రెండో ఏడాది 'ముస్తాక్ అలీ' కర్ణాటకదే
కర్ణాటక కెప్టెన్ మనీశ్ పాండే

ఆదివారం జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ తుదిపోరులో కర్ణాటక విజేతగా నిలిచింది. తమిళనాడుపై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీ నిలబెట్టుకుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఒకే ఏడాది విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు గెల్చుకున్న మొదటి టీమ్​గా నిలిచింది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ మనీశ్ పాండే 60 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో కేఎల్​ రాహుల్ 22, దేవదూత్ 32, రోహన్ కడమ్ 35 పరుగులతో ఆకట్టుకున్నారు.

అనంతరం ఛేదనలో తమిళనాడు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. షారుక్ ఖాన్ 16, హరి నిశాంత్ 14, వాషింగ్టన్ సుందర్ 24, దినేశ్ కార్తిక్ 20, బాబా అపరాజిత్ 40, విజయ్ శంకర్ 44 పరుగులు చేశారు. కానీ జట్టుకు విజయం అందించలేకపోయారు.

ABOUT THE AUTHOR

...view details