చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారీ సెంచరీ(161)తో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో ఏడో శతకం సాధించిన హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీలు. గింగిరాలు తిరుగుతున్న బంతిని సాధికారికంగా ఎదుర్కొని చేసిన ఈ శతకంతో జట్టులో తన విలువేంటో నిరూపించుకున్నాడని పలువురు అభినందించారు. జట్టు స్కోరు 300 పరుగులు చేస్తే అందులో రోహిత్‌వే 161 పరుగులు ఉండటం గమనార్హం.
ఈ ఓపెనర్.. సుదీర్ఘ ఫార్మాట్లో చేసిన ఏడు శతకాలు సొంతగడ్డపైనే సాధించడం విశేషం. దీంతో అతడు అజహరుద్దీన్ 6 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌పై అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక వీరుడిగా అవతరించాడు. హిట్‌మ్యాన్ శతకం చేసిన వెంటనే చెపాక్ మార్మోగింది. అభిమానులు అరుపులు, కేకలతో సందడి చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ సహా సహచరులు నిలబడి ఉత్సాహపరిచారు. రోహిత్ సతీమణి రితికా సజ్దె కూడా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేసింది.
హిట్‌మ్యాన్‌పై మాజీలు స్పందించారిలా..
"రోహిత్ చాలా బాగా ఆడావు. సవాళ్లు విసిరే పరిస్థితుల్లో సంతృప్తికర శతకమిది. కఠిన పిచ్‌పై బ్యాటింగ్‌లో నిర్ణయాత్మక ఫుట్‌వర్క్, సానుకూల తీవ్రత ప్రాముఖ్యం ప్రదర్శించావు. ఇక శతకాన్ని భారీ స్కోరుగా మలచాలి."
- వీవీఎస్ లక్ష్మణ్
"రోహిత్ శర్మ టాప్ క్లాస్. సొగసైన, అద్భుతమైన శతకమిది."
- హర్భజన్‌సింగ్
"సోదరుడు రోహిత్ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్. మైదానంలో ఎప్పుడూ తన ముద్ర వేస్తాడు. ఆల్‌ది బెస్ట్. త్వరలోనే కలుద్దాం."