అవకాశమొస్తే మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ప్రస్తుతం ఆరోన్ ఫించ్ (పరిమిత ఓవర్ల సారథి), టిమ్ పైన్ (టెస్టు సారథి) అత్యుత్తమ కెప్టెన్లు ఉన్నారని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ స్థానం ఖాళీగా లేదని తేల్చి చెప్పాడు.
రానున్న రోజుల్లో యాషెస్, టీ20 ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు సారథులు జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నారు. జట్టు భవిష్యత్ బాగుంది.