తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం: అక్తర్ - aktar kohli praises

ఆధునిక క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం అని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వాన్నీ ప్రశంసించాడు.

అక్తర్

By

Published : Nov 18, 2019, 2:58 PM IST

క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటున్నాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. తాజాగా ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టమని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

"ఆధునిక క్రికెట్​లో కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడు కఠినతరమైన బ్యాట్స్​మన్." - షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్.

ఇటీవలే బంగ్లాతో జరిగిన టీ20లో రోహిత్ శర్మ నాయకత్వాన్ని ప్రశంసించాడు అక్తర్.

"ఈ మ్యాచ్​లో బాస్ ఎవరో టీమిండియా నిరూపించింది. ఈ సిరీస్​లో తొలి గేమ్​లో ఓడినప్పటికీ.. టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రోహిత్ చక్కటి ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప టాలెంట్ ఉంది. హిట్ మ్యాన్​ కోరుకున్నప్పుడల్లా పరుగులు చేయగలడు" -పోషబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్.

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో విజయం సాదించిన భారత్ రెండో టెస్టు కోసం సిద్ధమవుతోంది. డే అండ్ నైట్ నిర్వహిస్తోన్న ఈ మ్యాచ్​కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. టీమిండియా తొలిసారి గులాబీ బంతితో ఆడబోతుంది.

ఇదీ చదవండి: గులాబీ బంతి ఆట కోసం ఆత్రుతగా గంగూలీ

ABOUT THE AUTHOR

...view details