ఈ యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ శతకాలు.. డేవిడ్ వార్నర్ సింగిల్ డిజిట్ స్కోర్లే కాకుండా ఇంకో విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ డీఆర్ఎస్(సమీక్ష) నిర్ణయాల తప్పిదాలూ పాపులర్ అవుతున్నాయి. ధోని దగ్గర డీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోవాలంటూ భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పైన్ ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
"ధోని రివ్యూ సిస్టమ్‌కు సంబంధించి విద్యార్థులను తీసుకునేందుకు మహీ సిద్ధంగా ఉంటే.. పైన్ అతడికి ఫోన్ చెయ్" - ఆకాశ్ చోప్రా.
యాషెస్ చివరి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ డెన్లై, జాస్ బట్లర్‌ల రివ్యూలను కోల్పోయాడు టిమ్‌పైన్. తప్పుగా ఊహించి సమీక్షలో విఫలమయ్యాడు. డీఆర్ఎస్కు సంబంధించి పాఠాలు నేర్చుకోవాలి అంటూ మ్యాచ్ అనంతరం తెలిపాడు ఆసీస్ కెప్టెన్. ఈ విషయం గురించి పై విధంగా స్పందించాడు ఆకాశ్ చోప్రా.
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ డ్రాగా ముగిసింది. చివరి టెస్టులో 135 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఇంగ్లీష్ జట్టు ఘనవిజయం సాధించింది.
ఇదీ చదవండి: భారత్ X దక్షిణాఫ్రికా తొలి టీ-20 వర్షార్పణం