తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్​కు సంబంధమేమీ లేదు' - ఏబీ డివిలియర్స్​ రీఎంట్రీ పై ఆకాశ్​ చోప్రా

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ అంతర్జాతీయ క్రికెట్​ రీఎంట్రీకి.. ఐపీఎల్​లో అతడి​ ప్రదర్శనకు సంబంధమేమీ లేదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. దీంతో పాటు దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ కూడా త్వరలోనే పునరాగమనం చేస్తాడని అన్నాడు.

dhoni
ధోనీ

By

Published : Jul 20, 2020, 3:58 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ, దక్షిణాఫ్రికా క్రికెటర్​​ ఏబీ డివిలియర్స్​ల రీఎంట్రీపై మాట్లాడాడు భారత మాజి క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. మహీ పునరాగమనం ఒక్క ఫోన్‌ కాల్ దూరంలో ఉందని అభిప్రాయపడ్డాడు.

"ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్​లో అతడి ప్ర‌ద‌ర్శ‌న‌కు అస‌లు సంబంధ‌మే లేదు. అతడు జాతీయ జట్టులోకి రావడమనేది ఈ మెగాటోర్నీపై ఆధారపడి లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడి సేవలను వినియోగించుకోవాలని అనుకుంటే తప్పకుండా తిరిగి జట్టుకు ఎంపికవుతాడు."

-ఆకాశ్​ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

ఏబీ డివిలియర్స్​ కూడా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్​లో పునరాగమనం చేస్తాడని అభిప్రాయపడ్డాడు ఆకాశ్​.

"అతడు మంచి ఫామ్​లో ఉన్నాడు. త్వరలోనే ఏబీ ఆడటం మనం చూస్తాం. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ జరిగితే.. డివిలియర్స్​ పాల్గొంటాడు."

-ఆకాశ్​ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

త్రీటీ క్రికెట్

దక్షిణాఫ్రికాలో సుదీర్ఘకాలం తర్వాత ప్రారంభమైన త్రీటీ క్రికెట్​ కప్​ ఎంతో రసవత్తరంగా సాగింది. శనివారం నిర్వహించిన ఫైనల్లో ఏబీ డివిలియర్స్ సారథ్యం వహించిన ఈగల్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇందులో రీఎంట్రీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులతో చెలరేగాడు. కరోనా బారిన పడ్డ వారికి సాయం అందించాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు (సీఎస్​ఏ) ఈ మ్యాచ్​ను ఏర్పాటు చేసింది.

ఇది చూడండి : టీమ్​ఇండియా మహిళా జట్టుపై కైఫ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details