ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌కు క్రికెటర్లు కుటుంబ సభ్యలకు అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అభిప్రాయపడ్డాడు బ్యాట్స్‌మన్ అజింక్యా రహానె. టోర్నీకి తన భార్య, కూతురు వస్తే బాగుంటుంది కానీ కరోనా వ్యాప్తి కారణంగా బయో బబుల్ నిబంధనలు విధిస్తే కచ్చితంగా దానిని పాటిస్తామని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన రహానె.. ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నాడు.
"కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆటగాళ్లతో కలిసి కుటుంబాలు ప్రయాణిస్తే బాగుంటుంది. కానీ భద్రత కూడా చాలా ముఖ్యం. భార్య, పిల్లలే కాదు తోటి జట్టు సభ్యుల ఆరోగ్యం చాలా కీలకం. ప్రస్తుతం దానికే తొలి ప్రాధాన్యం ఆ తర్వాతే క్రికెట్. లాక్‌డౌన్‌తో 4-5 నెలలు కుటుంబంతో చాలా ఆనందంగా గడిపాం. కాబట్టి ఆటగాళ్లతో కుటుంబసభ్యులను యూఏఈకి పంపించాలా వద్దా అనేది బీసీసీఐ, ఫ్రాంచైజీల నిర్ణయం"