తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎట్టకేలకు తన కుమార్తెను చూసిన రహానే - బిడ్డను చూసిన రహానే

శనివారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే సతీమణి రాధిక. విశాఖ టెస్టు సందర్భంగా తన కూతురును చూసుకోలేకపోయిన రహానే.. సోమవారం ఆ కోరిక తీర్చుకున్నాడు.

అజింక్య రహానే

By

Published : Oct 7, 2019, 8:14 PM IST

అజింక్య రహానే ఎట్టకేలకు తన బిడ్డను చూసే అవకాశం కలిగింది. తన సతీమణి రాధిక ధోపావ్​కర్ శనివారం నాడు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడుతున్న రహానేకు తన కూతురును చూసే అవకాశం దొరకలేదు.

సోమవరాం తన కుమార్తెను చూసి.. బిడ్డతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు రహానే. ఈ పోస్ట్​ నిమిషాల్లోనే వైరల్​గా మారింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న రహానే అక్టోబరు 10న పుణె వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం జట్టుతో కలవనున్నాడు.

తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక ధోపావ్​కర్​ను 2014లో వివాహం చేసుకున్నాడు. పాఠశాలలో కలుసుకున్న వీళ్లు అనంతరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై 203 పరుగులు భారీ విజయం సాధించింది భారత్​. రహానే 15, 27* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ రెండు ఇన్నింగ్స్​ల్లో రెండు శతకాలు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదీ చదవండి: సానియా సోదరితో అజారుద్దీన్​ తనయుడి పెళ్లి

ABOUT THE AUTHOR

...view details