న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 165 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మ్యాచ్‌లో టీమిండియా 101/5తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (19)తో కలిసి అజింక్య రహానే (46) కాసేపు నిలకడగా ఆడాడు. కివీస్ పేసర్ల బౌలింగ్‌ను సహనంతో ఎదుర్కొందీ జోడీ. కానీ.. ఆఖరికి సమన్వయలోపంతో వికెట్‌ను అప్పజెప్పింది.
రహానే మొదటిసారి.. పంత్ దురదృష్టం - rishabh pant unhappy with run out
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు రహానే కారణమంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నింగ్స్ 59వ ఓవర్లో సౌథీ వేసిన బంతిని పాయింట్ దిశగా నెట్టిన రహానే పరుగు కోసం ప్రయత్నించాడు. పంత్ కూడా స్పందించి.. వేగంగా రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ.. అప్పటికే బంతి ఫీల్డర్ అజాజ్ పటేల్ చేతుల్లోకి వెళ్లడం వల్ల అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. కానీ.. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన రహానే.. అలానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. పంత్‌కు స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరుగెత్తడం తప్ప మరో అవకాశం లేకపోయింది. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ అజాజ్ వికెట్లను గిరాటేశాడు. ఫలితంగా పంత్ రనౌటయ్యాడు.
ఇలా ఓ ఆటగాడి రనౌట్‌లో పాలుపంచుకోవడం రహానేకు ఇది మొదటిసారి. ఐదు నెలల తర్వాత పంత్‌కు టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చింది. మళ్లీ ఫామ్‌ను నిరూపించుకునేందుకు అతడు కూడా క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశాడు. కానీ రహానే కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అయితే రహానే ఇలా పంత్‌ను ఔట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌లోకి వచ్చిన ఆటగాడిని రనౌట్ చేయడం వల్ల భారత్ తొందరగా ఆలౌట్ అయిందని అంటున్నారు.