తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మొతేరా స్టేడియం భారత్​కు గర్వకారణం' - రాష్ట్రపతి

Sardar Patel Stadium
మొతేరా స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

By

Published : Feb 24, 2021, 11:50 AM IST

Updated : Feb 24, 2021, 2:33 PM IST

14:32 February 24

'మొతేరా స్టేడియం భారత్​కు గర్వకారణం'

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా నిలిచిన మొతేరా మైదానం భారత దేశానికి గర్వకారణన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.  

" 2018, నవంబర్​లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు 90వేల సీటింగ్​ సామర్థ్యం కలిగిన మెల్​బోర్న్ క్రికెట్​ మైదానం ప్రపంచంలోనే అతిపెద్దదిగా తెలుసుకున్నా. ఇప్పుడు మొతేరాలో 1,32,000 సీటింగ్​ సామర్థ్యం కలిగిన స్టేడియం ఉండటం భారత్​కు గర్వకారణం. " 

     - రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

13:29 February 24

దేశానికే క్రీడల నగరంగా అహ్మదాబాద్​: షా

గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఇప్పుడు దేశానికి క్రీడల నగరంగా మారిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియం, సర్దార్​వల్లాభాయ్​ పటేల్​ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​లతో పాటు నరాన్​పురాలో స్పోర్ట్స్​​ కాంప్లెక్స్​ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మూడింతో ఎలాంటి అంతర్జాతీయ క్రీడలనైనా నిర్వహించగలమని తెలిపారు. 

' ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాతీలు 2 రంగాలలో-క్రీడలు, సాయుధ దళాలలో కూడా పురోగతి సాధించాలని ఆయన చెప్పారు. నా అభ్యర్థన మేరకు జీసీఏ ఛార్జ్​ తీసుకుని క్రీడలను ప్రోత్సహించారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియం నిర్మించాలనేదే ఆయన విజన్​. ఈ 1.31 లక్షల సీటింగ్​ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం.. ఇకపై నరేంద్ర మోదీ స్టేడియంగా మారనుంది.' అని పేర్కొన్నారు అమిత్​ షా

13:10 February 24

మొతేరాకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు

మొతేరాలోని సర్దార్​ వల్లభ్భా​య్​ పటేల్​ స్టేడియం పేరును మార్పు చేశారు. నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. 

13:00 February 24

'మొతేరా స్టేడియం దేశానికే గర్వకారణం'

మొతేరా స్టేడియా కేవలం క్రికెట్​ కోసమే కాదని, అది దేశానికే గర్వకారణమన్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమే కాదని, అత్యాధునిక హంగులు కలిగినదిగా చెప్పారు. అహ్మదాబాద్​ దేశానికే క్రీడల నగరంగా మారిందన్నారు. మొతేరా స్టేడియం ప్రారంభించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి. 

12:20 February 24

మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

గుజరాత్ అహ్మదాబాద్​లోని​ మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్​ వల్లాభాయ్​ పటేల్​ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు భూమి పూజ చేశారు.

కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు, గుజరాత్​ ఉప ముఖ్యమంత్రి నితీశ్​ పటేల్​ హాజరయ్యారు. 

  • ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మైదానాన్ని నిర్మాణం
  • లక్షా పదివేల సీటింగ్‌ సామర్థ్యంతో సర్దార్‌పటేల్ స్టేడియం పునర్నిర్మాణం
  • 63 ఎకరాల్లో ఏర్పాటైనా ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 800 కోట్లు ఖర్చు.
  • మొతేరాలో మధ్యాహ్నం 2.30 గం.కు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్
  • పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా మొతేరాలో డేనైట్ టెస్టు మ్యాచ్

12:18 February 24

మొతేరాకు రాష్ట్రపతి..

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, కేంద్రమంత్రి అమిత్​ షా... మొతేరా స్టేడియానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో స్టేడియాన్ని ప్రారంభించనున్నారు.

11:37 February 24

లైవ్​: మొతేరా స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి

ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్​ పటేల్​ స్టేడియం (మొతేరా)ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రారంభించనున్నారు. మొతేరా మైదానం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే అక్కడ సందడి మొదలైంది. 

ఇవాళ్టి నుంచి ఈ మైదానంలో భారత్​-ఇంగ్లాండ్​ మధ్య పింక్​ బాల్​ టెస్ట్​ ఆరంభం కానుంది. 

Last Updated : Feb 24, 2021, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details